హెబ్బాపటేల్ తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా అంధగాడు హిట్ తో హెబ్బాకి కోలీవుడ్ ఛాన్స్ తగిలిందట. దాంతో తెలుగులో క్రేజీ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్న ఈ అప్ కమింగ్ బ్యూటీ… కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైందట… టాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌లో ఆమెకు ఛాన్స్ దాదాపు ఖాయమైందని టాక్.
తెలుగులో నాగ చైతన్య – తమన్నా లు జంటగా నటించిన 100 % లవ్ చిత్రం ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. జివి ప్రకాష్ హీరోగా చేస్తున్నఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు చంద్రమౌళి తెరకెక్కిస్తున్నాడు. అయితే మొదట్లో ఈ చిత్రంలో జివి ప్రకాష్ కి జోడిగా లావణ్య త్రిపాఠి ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు లావణ్య ప్లేస్ లోకి హెబ్బా పటేల్ వచ్చి చేరిందని అంటున్నారు.
అయితే ఈ సినిమా రీమేక్‌లో హీరోయిన్ తమన్నా రోల్‌ని ఎవరితో రీ ప్లేస్ చేయాలనే విషయమే ఇంకా ఎటూ తేలడం లేదు.మొదట ‘100 % లవ్ ‘ కోలీవుడ్ వర్షన్లోనూ మిల్కీ బ్యూటీనే హీరోయిన్ అని కొంతకాలం ప్రచారం జరిగినా… ఆ తరువాత ఈ ఛాన్స్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సొంతమైందని అంతా అనుకున్నారు.
కోలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న లావణ్య త్రిపాఠి ఈ ఛాన్స్ ను వదులుకునే అవకాశం లేకపోవడంతో… ఈ సినిమా కోలీవుడ్ వర్షన్ లో లావణ్య నటించడం ఖాయమే అని చాలామంది భావించారు. అయితే ఆ ఛాన్స్ అనుకోకుండా హెబ్బా పటేల్ సొంతమైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆఫర్ పలకరించగానే మరో మాట ఆలోచించకుండా ఓకే చెప్పిన టాలీవుడ్ కుమారి… ఈ సినిమాకు సైన్ కూడా చేసేసిందని టాలీవుడ్ సర్కిల్స్ టాక్… కోలీవుడ్ అవకాశం కోసం హెబ్బ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోందని… అందుకే ఛాన్స్ దొరకగానే ఓకే అనేసిందని అంటున్నారు.
ఈ నయా మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుందని సమాచారం… అయితే సుకుమార్ రికమండేషన్ కారణంగానే హెబ్బాకు ఈ అవకాశం వచ్చిందనే వారు లేకపోలేదు…అందం మందమైతే చాలు గుడికట్టి పూజించటం సాంబారు బాబులకు అలవాటు.. మరి ఈ సినిమాతో హెబ్బా తమిళంలో జెండా పాతుతుందేమో చూడాలి.