ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దవుతున్నాయి. ముఖ్యంగా ఎగువన కురుస్తున్న వానలతో ప్రాజెక్టులను నిండుకుండలను తలపిస్తున్నాయి. గోదావరి ఉరకలు…ప్రాణహిత పరవళ్ళతో కాళేశ్వరంకు వరద ప్రవాహం పొట్టెత్తుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద కాళేశ్వరం వద్ద 8.99 మీటర్ల ఎత్తున ప్రాణహిత,గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.
మెడిగడ్డ బ్యారేజ్:
మెడిగడ్డ బ్యారేజ్ ఎత్తు 100 మీటర్లు కాగా ప్రస్తుత లెవెల్ 95.2 మీటర్లుగా ఉంది.పూర్తి సామర్థ్యం 16.17 టిఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 4.5 టిఎంసిలు.65 గేట్లు ఎత్తిన నీటిని వదులుతున్నారు అధికారులు. మెడిగడ్డ బ్యారేజ్ ఇన్ ఫ్లో 5 లక్షల 27 వేల క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 5 లక్షల 27 వేల క్యూసెక్కుల నీరు.
అన్నారం బ్యారేజ్:
అన్నారం బ్యారేజ్ లో 8 గేట్ల ఎత్తి (బ్లాక్ 2 లో 1,2,3,5,7,9,11,12) 36.008 కుసెక్కూ ల జలాలు దిగువకు వదులుతున్నారు.అన్నారం బ్యారేజ్ పూర్తి లెవెల్ 119 మీటర్లు. ప్రస్తుత లెవెల్ 118.350 మీటర్లు. పూర్తి సామర్థ్యం 10.87టిఎంసీలు.ప్రస్తుత సామర్థ్యం 9.23 టిఎంసి నీటి మట్టం ఉంది.
అన్నారం పంప్ హౌస్:
అన్నారం పంప్ హౌస్లో పంపులన్ని బంద్ చేశారు.
సుందిళ్ళ బ్యారేజ్:.
సుందిళ్ళ బరాజ్ పూర్తి లెవెల్ 130 మీటర్లు. ప్రస్తుతం లెవెల్ 126.38 మీటర్లు.పూర్తి నీటి మట్టం 8.83 టిఎంసీలు. ప్రస్తుతం 6.4 టిఎంసి ల నీటి మట్టం ఉంది.