కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద నిర్మించిన భారీ ప్రాజక్టు చాన్నాళ్ల తర్వాత జలకళతో కనువిందు చేస్తోంది. శ్రీశైలం ప్రాజక్టు10 గేట్లను ఎత్తి నీటిని పంపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్రాజక్టు వద్ద కోలాహలం నెలకొంది. సుదీర్ఘ కాలం తర్వాత ప్రాజక్టు నిండుకుండలా కనిపిస్తుండడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాంతో శ్రీశైలం హైదరాబాద్ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయియాయి.
వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రాజక్టు ఏరియా నుంచి దోమలపెంట వరకు 6 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓవైపు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు భారీగా వాహనాలు వస్తుండడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మరోవైపు ట్రాఫిక్ నియంత్రించేందుకు శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు పెడుతున్నారు పోలీసులు.