కాళేశ్వరం బ్యారేజ్‌లకు దేవతామూర్తుల పేర్లు..

438
Kaleshwaram Project
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్‌ లు, పంపుహౌజులకు దేవతామూర్తుల పేర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.

1.మేడిగడ్డ బ్యారేజ్‌కి లక్ష్మి బారాజ్ గా, కన్నెపల్లి పంపుహౌజుకు లక్ష్మి పంపు హౌజుగా నామకరణం చేశారు.

2.అన్నారం బ్యారేజికి సరస్వతి బారాజ్ గా, సిరిపురం పంప్ హౌజ్ కు సరస్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు.

kaleswaram

3.సుందిళ్ల బ్యారేజ్‌ కు పార్వతి బారాజ్ గా, గోలివాడ పంపుహౌజు కు పార్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు.

4.నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపు హౌజుకు నంది పేరు ఖరారు చేశారు.

5.లక్ష్మిపురం పంపుహౌజుకు గాయత్రి పేరు పెట్టారు.

- Advertisement -