ఏపీకి భారీ వర్ష సూచన..

83
rains
- Advertisement -

అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు నగరాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి,చిత్తూరు జిల్లాలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఉందని..అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాజ్ వే లు దాటరాదని…అవసరమైన చోట పునరావాస కేంద్రాల ఏర్పాటు అధికారులు సిద్ధం గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ తెలిపారు.

- Advertisement -