భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలో ఐదుగురు గల్లంతు కాగా రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ముంబై, ఠాణె, రాయగడ్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
చెంబూర్, దాదర్, హింద్‌మాతా, అంధేరి, కింగ్స్ సర్కిల్ వంటి ప్రాంతాల్లో తీవ్ర నీటిముంపుకు గురయ్యాయి. ముంబై యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది. తీవ్ర నీటిమునిగింపును ఎదుర్కొనేందుకు BMC తమ మొత్తం సిబ్బందిని రంగంలోకి దించింది. ఇంజినీర్లు, పంప్ ఆపరేటర్లు, అత్యవసర ప్రతిస్పందన బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో నియమించారు.
Also Read:బరువెక్కిన హృదయంతో చెబుతున్నా!
పౌరులకు సహాయం చేయడానికి 1916 హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

