రాగల 24 గంటల్లో భారీ వర్షాలు..హైదరాబాద్‌లో ఆరెంజ్‌ అలర్ట్‌

211
rains
- Advertisement -

రాష్ట్రాంలో వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా భారీ వర్షాలతో వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బందంలో ఉండగా మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో పాటు తుర్పు పడమర దిశలో షియర్‌ జోన్‌ ఏర్పడింది. దీని ప్రభావం గ్రేటర్‌కు అతి సమీపంలో ఉన్న యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌ జిల్లాలపై అధికంగా ఉండనున్నది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.

ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ఊర్లకు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు నీటమునిగాయి. రహదారులు, వంతెనలపై వరద ప్రవాహాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరిన్ని రోజులు వానలు పడే నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -