- Advertisement -
ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొన్నిచోట్ల, రేపు చాలా చోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఎల్లుండి కూడా చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Advertisement -