- Advertisement -
భారీ వర్షాలు హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాలను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. లోతట్లు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీలు చెరువులను తలపించాయి.
వరద నీటి ఉదృతికి రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. మంగళవారం రోజంతా భారీ వర్షం నమోదు కావడంతో.. రాత్రి వరకు వీధులన్నీ నదులను తలపించాయి. నగరంలోని పలు కాలనీల్లో వాహనాలు నీటిలో కొట్టుకుపోగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Advertisement -