హైదరాబాద్‌లో భారీ వర్షం..

178
Heavy rains in telangana
- Advertisement -

హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్మతోంమది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి, దుండిగల్‌లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది.

ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వివరించింది.

అత్యధికంగా దుబ్బాకలో 82 మిల్లీ మీటర్లు, కొండపాకలో 70.3 మి.మీ వర్షాపాతం నమోదైంది. గత 24 గంటల్లో మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో 14 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నల్గొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురవగా పలు చోట్ల జల్లులు పడ్డాయి.

- Advertisement -