నగరంలో కుండపోత వర్షం.. అప్రమత్తంగా ఉండాలి..

291
rains
- Advertisement -

గ్రేటర్ హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.ఈ భారీ వానకు నగరం త‌డిసి ముద్దైంది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురియ‌డంతో న‌గ‌రం అతలాకుత‌ల‌మైంది. భారీ వ‌ర్షానికి రోడ్లు, లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. నగరంలో కురుస్తున్న అకాల భారీ వర్షం నేపధ్యంలో విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్‌లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డి. భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలి అధికారులకు సూచించారు.

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయాలని జి రఘుమా రెడ్డి తెలిపారు. వోల్టేజ్‌లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలనిక సీఎండీ జి రఘుమా రెడ్డి తెలిపారు.

న‌గ‌రంలోని ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట‌, బేగంపేట‌, సికింద్రాబాద్‌, అల్వాల్, తార్నాక‌, ఉప్ప‌ల్, నాచారం, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, క‌ర్మ‌న్‌ఘాట్‌, మ‌ల‌క్‌పేట‌, చార్మినార్‌, జూపార్క్‌, జియ‌గూడ‌, లంగ‌ర్‌హౌస్‌, మెహిదీప‌ట్నం, కోఠి, అబిడ్స్, ల‌క్డీకాపూల్‌, గ‌చ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, ప‌టాన్‌చెరు, కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.

- Advertisement -