వీడియో..రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు

6
- Advertisement -

ఎడతెరపి లేని వర్షాలతో రాజస్థాన్ అతలాకుతలమైంది. కోటా సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. కోటా, పాలి, జాలోర్, ధోల్పూర్‌ జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో మొత్తం 12 మంది మృతి చెందారు.

ట్రాక్‌లపై వరద నీరు నిలవడం వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జోధ్‌పూర్ నగరంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల సాధారణ జీవితం స్థంభించిపోయింది. ఓ రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన గోడ కూలిపోయింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, ఒక వ్యక్తి తన ఇంటి గేట్ పక్కన నిల్చుని ఉండగా, అకస్మాత్తుగా సమీపంలోని గోడ కూలిపోయింది. గోడ కూలిన ప్రభావంతో ఇంటి గేటులోని ఒక భాగం కూడా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయింది. సొసైటీ వీధిలో పార్క్ చేసిన అనేక వాహనాలు ఈ కూలిపోయిన గోడ కారణంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన జోధ్‌పూర్‌లోని పావటా ప్రాంతంలో చోటు చేసుకుంది.

భీల్వారా జిల్లాలో, ఇద్దరు వ్యక్తులు వర్షపు ప్రవాహంలో కొట్టుకుని మృతి చెందారు. అజ్మీర్ రైల్వే స్టేషన్ సమీపంలో నీటి ముంపు కారణంగా పలు రైళ్లు నిలిపివేయబడ్డాయి.

 

Also Read:కొత్తపల్లిలో ఒకప్పుడు..పక్కా హిట్!

- Advertisement -