బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

237
rains
- Advertisement -

బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

వర్షాలకు తడిసి ముద్దైంది ఉత్తరప్రదేశ్‌. బీహార్‌లోనూ వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా వర్షాల దాటికి నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈస్ట్ చంపారన్‌లో గండక్‌ బ్యారేజీ నిండిపోగా సమీప గ్రామాలు జలమయం అయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పశ్చిమబెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కోల్‌కతా నగరం తడిసి ముద్దవుతోంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

- Advertisement -