మూడు రోజులు భారీ వర్షాలు..

49
- Advertisement -

రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాష్ట్రంలో రాగల ఏడురోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.

Also Read:మెంతి ఆకులతో ఇలా చేస్తే.. ఆ సమస్యలు దూరం !

శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా కొనసాగుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి.

Also Read:అల్ బకార పండ్లతో.. ఎన్ని లాభాలో !

- Advertisement -