నేడు,రేపు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు..

173
rains
- Advertisement -

రాష్ట్రంలో ఇవాళ,రేపు పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఉత్తర బంగా‌ళా‌ఖా‌తంలో మంగ‌ళ‌వా‌రం‌ నా‌టికి అల్ప‌పీ‌డనం ఏర్పడే అవకాశాలున్నాయని దీని ప్రభా‌వంతో రాష్ట్ర‌వ్యా‌ప్తంగా సోమ, మంగ‌ళ‌వా‌రాల్లో చాలా‌చోట్ల ఉరు‌ములు మెరు‌పు‌లతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలిపింది.

మంగ‌ళ‌వారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని….గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌‌లోని పలు‌చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని తెలిపింది.

- Advertisement -