రాష్ట్రంలో మళ్లీ వర్షాలు..!

102
rains
- Advertisement -

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ..ఎల్లుండి కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఒకటి, రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఇక, ఈ నెల 20, 21 తేదీల్లో తెలంగాణలో ఒకటి, రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది వాతావరణ కేంద్రం.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు.. పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.. కొన్ని చోట్ల భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడిప్పుడే కాస్త తెరపి ఇస్తుండా.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

- Advertisement -