బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలు

7
- Advertisement -

ఉత్తర/ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతోంది ఉపరితల ఆవర్తనం. మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కి మీ మధ్యలో కొనసాగుతోంది ద్రోణి.

ఈనెల 25వ తేదీకి తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడనున్న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఇవాళ తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు.

Also Read:వెంకీ- త్రివిక్రమ్‌..షూటింగ్ అప్‌డేట్!

- Advertisement -