- Advertisement -
దేశ రాజధానికి ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే దక్షిణ కొంకణ్ – గోవా తీరానికి దూసుకెళ్లి తూర్పు – మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తరవైపుకు కదిలి రాబోయే 36 గంటల్లో మరింత తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం వల్ల రాబోయే మూడురోజులపాటు కొంకణ్ ప్రాంతంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read:మూడు రోజుల్లో కేరళకు నైరుతి!
- Advertisement -

