హైదరాబాద్ మెట్రో ఇటీవలె ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికుల నుండి విమర్శలు రావడంతో పది శాతం ఛార్జీలను తగ్గిస్తున్నట్లు తెలిపారు మెట్రో అధికారులు.
సవరించిన ఛార్జీలను ఎల్ అండ్ టీ మెట్రో తాజాగా ప్రకటించగా ఈ నెల 24వ తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల వివరాలను పరిశీలిస్తే.. రెండు కిలోమీటర్ల వరకు రూ.12 ఉండగా.. రూ. 11 గా నిర్ణయించారు. నాలుగు కిలోమీటర్ల వరకు రూ.18 ఉండగా.. రూ.17 గా నిర్ణయించారు. ఆరు కిలోమీటర్ల వరకు రూ.30 ఉండగా.. రూ.28 గా నిర్ణయించారు.
తొమ్మిది కిలో మీటర్ల వరకు రూ.40 ఉండగా.. రూ. 37గా నిర్ణయించారు. 12 కిలోమీటర్ల వరకు రూ.50 ఉండగా.. రూ. 47 గా నిర్ణయించారు. 15 కిలోమీటర్ల వరకు రూ.55 ఉండగా.. రూ.51 గా నిర్ణయించారు. 18 కిలోమీటర్ల వరకు రూ.60 ఉండగా.. రూ. 56గా నిర్ణయించారు. 21 కిలోమీటర్ల వరకు ప్రస్తుత ఛార్జీ రూ. 66 కాగా.. రూ.61 గా నిర్ణయించారు. 24 కిలోమీటర్ల వరకు రూ.70 ఉండగా.. రూ.65 గా నిర్ణయించారు. 24 కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసే వారికి టికెట్ ధర రూ.75 ఉండగా.. రూ.6 తగ్గించి రూ.69 గా నిర్ణయించారు.
Also Read:మూడు రోజుల్లో కేరళకు నైరుతి!

