తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో భారీ వర్షాలు పడవచ్చు అన్నారు.
ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో ఆకాశం మేఘావృతంగా ఉండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. హైదరాబాద్‌లో సాయంత్రం తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని… రోజు మొత్తం ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నంలో ఆకాశం మేఘావృతంగా ఉండి తేలికపాటి వర్షం లేదా జల్లులు పడవచ్చు అని తెలిపింది.
Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం:UV క్రియేషన్స్

