ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోసహా పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మే నెల చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి.
తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read:
హైదరాబాద్ లో సోమవారం ఉదయం వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచే వాతావరణం మేఘావృతం అయ్యిఉండటంతోపాటు ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వారం రోజుల పాటు నగరంలో అడపాదడపా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read:TG:ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ప్రెసిడెంట్‌గా సునీల్ నారంగ్

