నైరుతి ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద వర్షం కారణంగా రూఫ్ కొంత భాగం కూలిపోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామున వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో టెర్మినల్-1 వద్ద టెంట్ ఆకారంలోని రూఫ్‌లోకి వర్షపు నీరు చేరి కొంత భాగం కూలిపోయింది.
ఇక భారీ వర్షాలకు కేరళ, తమిళనాడు అతలాకుతలం అయింది. నైరుతి రుతు పవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. నిన్న రాత్రి నుంచి కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Also Read:కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలి: హరీష్

