నీరు జీవనాధారం, దేశాల మధ్య నీళ్ల కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనకు తెలుసు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్…తెలంగాణ ఉద్యమం కూడా నీళ్ల నుంచే పుట్టింది..అంతటి ప్రాధాన్యం ఉన్న నీళ్లను కాంగ్రెస్ విస్మరించింది…కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా విఫలం అన్నారు.
నాడు సమైక్య ఏపీలో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం…నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల రూపంలో నష్టం వాటిల్లుతున్నది..ఉమ్మడి పాలనలో సాగిన జలదోపిడి, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైంది అన్నారు. నాడు పదవుల కోసం పెదవులు మూసారు, నేడు అదే పరిస్థితి…. గురు దక్షిణ చెల్లించుకుంటున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు…ఏపీ బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయే కుట్ర జరుగుతుందన్నారు. ఇది తెలంగాణకు తీవ్రమైన నష్టం చేయబోతున్నది… మిగులు జలాలు అంటూ మాట్లాడుతున్నారు అన్నారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని చంద్రబాబు లేఖలు ఎందుకు రాసిండు… ఇదే చంద్రబాబు ఆనాడు కాళేశ్వరం అడ్డుకునేందుకు అనేక లేఖలు రాశారు అన్నారు.
2018లో కేంద్ర జలవనరుల శాఖకు ఉత్తరం రాసిండు…. అపెక్స్ కౌన్సిల్, సిడబ్లుసి అనుమతి లేకుండా, విభజన చట్టం ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నరని అడ్డుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నడు… కాళేశ్వరం కొత్తది కాదు, ప్రాణహితకు కొనసాగింపు అని వాస్తవం చెప్పి కేంద్రం నుంచి అనుమతి సాధించాం అన్నారు. భక్త రామదాసు లిఫ్టు ఆపేందుకు లేఖ రాసిండు…. పాలమూరు సహా 20, 30 ప్రాజెక్టులు అడ్డుకోవాలని లేఖలు రాసిండు చంద్రబాబు…గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసులు వేసిండు అన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? విభజన చట్టం ప్రకారం, కేఆర్ఎంబీ లేదా జీఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి. ఆయా పరివాహక రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి అన్నారు.ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు చేతిలో ఉందని రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారు…మా పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటే అడ్డుకున్నరు, మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు అన్నారు.
గత అసెంబ్లీలో చెప్పిండు, నీతి అయోగ్ బహిష్కరిస్తం అని… నిన్న మాత్రం అందరి కంటే ముందే పోయి నీతి అయోగ్ మీటింగ్ కు పోయిండు..బనకచర్ల అడ్డుకుంటడు, నీతి అయోగ్ లో మాట్లాడుతడు అనుకున్నం అన్నారు కానీ మంత్రి మాట్లాడడు, ముఖ్యమంత్రి మాట్లాడడు అన్నారు. మిగులు జలాల వాడుకుంటున్నం అని చంద్రబాబు చెబుతున్నడు…గోదావరి మిగులు జలాలు కావు అవి, తెలంగాణ వినియోగించుకోకపోవడం వల్ల కిందకు వెళ్తున్న నీళ్లు అవి.
అసలు కుట్ర ఏమిటంటే, గోదావరి మీద ట్రిబ్యునల్ వేయాలని ఏపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే బనకచర్ల నిర్మించి, ప్రజాధనం ఖర్చు అయ్యింది కాబట్టి, నీళ్లు కేటాయించాలని చెప్పి, 200 టీఎంసీలు తీసుకునే కుట్ర ఇది ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నది అన్నారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి, బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానిక పంపాలి…ఈ విషయంపై సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలని, ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఆఫీసర్లతో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకుంటావా?
ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, చరిత్ర హీనులుగా మారిపోతారని హెచ్చరిస్తున్నాం… రాష్ట్ర హక్కులు కాపాడటమే మా ఆరాటం. రాజకీయం కోసం కాదు మా ఆరాటం అన్నారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వరు, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వరు….బిజేపీ కేంద్ర మంత్రులు ఆలోచించాలి,కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలని, రాష్ట్ర హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం… అసెంబ్లీలో ఏ అంశం మీద చర్చకు అయినా నేను ఎప్పుడూ సిద్ధమేనన్నారు.
Also Read:నిద్రలేమి సమస్య…అయితే!

