AP:పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

7
- Advertisement -

ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు వర్ష సూచన ఉంది.

నేడు విశాఖ, అల్లూరి జిల్లాల్లో ,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విశాఖ, గంగవరం, కళింగపట్నం పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు సైతం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా లోతట్టుప్రాంత ప్రజలు మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read:పాత బ్యాంకు ఖాతాలో డబ్బు మర్చిపోయారా?

- Advertisement -