BB9:శ్రీజ రీ ఎంట్రీ!

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 52 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా భరణి-శ్రీజ బిగ్‌బాస్ ఇంట్లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఇద్దరిలో ఒక్కరికే హౌస్‌లో స్థానం ఉందని బిగ్‌బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఒక్కరూ ఎవరనేది నిర్ణయించడానికి బిగ్‌బాస్ వివిధ రకాల టాస్కులు పెట్టాడు బిగ్ బాస్.

హౌస్‌మేట్స్‌లో కొందరినీ తమ సైనికులుగా భరణి-శ్రీజ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చే ఒక్కో టాస్కులో గెలిచి గార్డెన్ ఏరియాలో ఉన్న ప్యాలెస్‌పై తమ ఫ్లాగ్స్ పెట్టాలి. ఎక్కువ ఫ్లాగ్స్ సాధించి ఆ ప్యాలెస్‌ని ఎవరు అధీనంలోకి తెచ్చుకుంటారో వాళ్లే ఈ హౌస్‌లో ఉంటారన్నమాట. తొలుత ‘కట్టు-పడగొట్టు’ టాస్కులో భరణి-శ్రీజ ఇద్దరూ తమకి సపోర్ట్‌గా ఆడేందుకు హౌస్‌లోని ఇద్దరు సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది.

ఈ గేమ్‌లో తమ తరఫున బరిలోకి దిగేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావాలని భరణి-శ్రీజ ఇద్దరూ ట్రై చేశారు. అయితే శ్రీజ కోసం డీమాన్-గౌరవ్ ఆడతామని ముందుకు వచ్చారు. మరోవైపు భరణి కోసం నిఖిల్ ముందుకు వచ్చాడు. గేమ్ మొదలుకాగానే భరణి.. డీమాన్‌ని ఆపడానికి ట్రై చేశాడు. మరోవైపు నిఖిల్.. గౌరవ్‌ని డిఫెండ్ చేశాడు. దీంతో శ్రీజ తన టవర్ పెడుతుంటే.. ఇమ్మూ.. భరణి టవర్ పెట్టేందుకు ట్రై చేశాడు.అయితే సంచాలకులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో వారిని తొలగిస్తూ బిగ్ బాస్ షాకిచ్చాడు.

తర్వాత భరణి-శ్రీజ మీరిద్దరూ మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో ఒకరి పేరు సంచాలకులుగా చెప్పండి అని బిగ్‌బాస్ అన్నాడు. దీంతో శ్రీజ చెప్పిన పేరు భరణి.. భరణి చెప్పిన పేరు శ్రీజ ఒప్పుకోలేదు. చివరికి మాధురిని సంచాలకుడిగా ఎంపిక చేయగా ఈ టాస్క్‌లో శ్రీజయే గెలిచినట్లు బిగ్‌బాస్ అంటూ మాధురి అనౌన్స్ చేసింది. ఇలా టాస్క్‌ల్లో శ్రీజ టీం గెలవడంతో భరణి ఇంటి నుండి బయటకు వచ్చాడు.

Also Read:ఫేస్‌బుక్‌ తరహాలో వాట్సాప్‌లోనూ!

- Advertisement -