రాష్ట్రంలో రాగల 3రోజులు భారీ వర్షాలు..

186
rains
- Advertisement -

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం కొనసాగుతుందని, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ, రేపు చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం వివరించింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద నిన్న అల్పపీడనం ఏర్పడగా, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -