నాగ చైతన్య వదిలిన నాగ్‌ ‘బంగార్రాజు’ లుక్..

226
Naga Chaitaniya
- Advertisement -

కింగ్‌ నాగార్జున బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన నటిస్తున్న చిత్రాల అప్‌డేట్స్‌ వస్తుండడంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. నాగార్జున నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘బంగార్రాజు’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన చేసిన ‘బంగార్రాజు’ పాత్రని ప్రధానంగా చేసుకొని ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో నాగ్ తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తుండటం చిశేషం. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభం అయిన ఈ మూవీ నుంచి నేడు (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే సందర్భంగా, చైతూ ఫస్ట్ లుక్‌ను వదిలి తండ్రికి విషెస్ తెలిపారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

మరోవైపు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఫాంటసీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతుండ‌గా, ఈ సినిమాకు ‘ఘోస్ట్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు మేకర్స్‌. ఈ లుక్‌లో వర్షంలో కత్తి పట్టుకొని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ ప్యాక్‌ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు.

- Advertisement -