తిరుమలలో భారీ వర్షం.. విరిగి పడుతున్న కొండచరియలు..

116
Heavy rain
- Advertisement -

గురువారం తిరుపతిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. తిరుమల ఘట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అదే విధంగా, పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. అలిపిరి నడక మార్గం గాలి గోపురం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. ఆ పక్కనే ఉన్న మూడు షాపులుపై భారీ వృక్షం పడింది.. అయితే ఆ సమయంలో షాపుల్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిన… మూడు షాపులలో ఉన్న వస్తువులు ధ్వంసమైయ్యాయి. ఈ క్రమంలో అధికారులు వాహన దారులను, స్థానికులను అప్రమత్తం చేశారు.

- Advertisement -