భాగ్యనగరంలో భారీ వర్షం..

179
rain

హైదరాబాద్ సహా తెలంగాణాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది, సికింద్రాబాద్ , కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, బాలానగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండ, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ఏరులైపారుతుంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.