నేటి నుండి తెలుగు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు..

352
Heavy Rain
- Advertisement -

ఉత్తర బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుందని, మంగళవారం నాటికి ఇది వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు.

దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మరింత ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -