తిరుమలలో కుండపోత వర్షం..

7
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా 48 గంటల్లో వాయుగుండంగా మారనుంది అల్పపీడనం. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురియగా తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇక తిరుమలలో కుండపోత వర్షం కురుస్తుండగా భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ఇక తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా శ్రీవారి సర్వదర్శనానికి కృష్ణతేజ అతిథిగృహం వరకు వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,026 మంది భక్తులు దర్శించుకోగా నిన్న శ్రీవారికి 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లుగా ఉంది.

Also Read:బస్తీ దవాఖానకు సుస్తీ?:హరీష్‌

- Advertisement -