హైదరాబాద్‌లో భారీ వర్షం..

154
rains
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుండే భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.సోమాజిగూడ, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, కూకట్‌పల్లి, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, మారేడుపల్లి, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మోహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వాన పడింది.

ఉపరితల అవార్తనం కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రేపు కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -