ఎగువ పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలు నిండి దిగువన ఉన్న జూరాల జలాశయానికి వరదనీరు పోటెత్తుటంతో జూరాల జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు.జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి గత మూడు రోజులుగా వరదనీరు బారీగా వచ్చి చేరుతుంది దీనితో శ్రీశైలం జలాశయం వరదనీటితో జలకలను సంతరించుకుంది. శ్రీశైలం జలాశయం నిన్న ఇదే సమయానికి 804 అడుగులుగా నమోదైంది.
అయితే ఒక్కరోజులో ఏకదాటిగా 13 అడుగు వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్తాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 819 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్తాయి టిఎంసి 215 కాగా ప్రస్తుతం జలాశయంలో 40 టిఎంసిలుగా నమోదు అయింది. అంటే ఒక్క రోజులో 9 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. జూరాలనుంచి ఇన్ ఫ్లోగా ఒక లక్ష. 73 వేల 796 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది.