భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం మహాక్షేత్రం

531
srisailam
- Advertisement -

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసం చివరి సోమవారం కావటంతో భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ కర్నాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం తరలి వచ్చారు. భక్తుల రద్ది అధికంగా ఉండటంతో అన్ని ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చన సేవ టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కార్తీకమాసం చివరి సోమవారం మహావిష్ణువును పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం .

వేకువజామున నుంచే భక్తులు ఆలయంలోని ఉసిరి చెట్టు కింద గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకుంటున్నారు పాతాళగంగలొ పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ వడిలొ కార్తీక దీపాలు వదిలుతున్నారు భక్తుల రద్దీ అదికంగా ఉండటంతో శ్రీశైలం ఆలయంలోని స్వామిఅమ్మవార్ల దర్శనం వేళలలు అధికారులు మార్పులు చేశారు.

వేకువజామున మూడుగంటలకే ఆలయ ద్వారాలు తెరచి ప్రాతఃకాల పూజలు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. మల్లికార్జునస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శ్రీశైలం ఆలయంలో క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్వామివారి ప్రసాదాలను పాలు మజ్జిగ బిస్కట్ పాకిట్లను దేవస్థానం అధికారులు ఉచ్చితంగా పంపిని వేస్తున్నారు శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది.

Heavey Rush in Srisailam Mallikarjuna Swamy Temple

- Advertisement -