Heatwaves:ఆ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..!

89
- Advertisement -

దేశంలో వడగాలులతో సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినా..అనేక రాష్ట్రాలల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వడగాలుల ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో భారత వాతావరణ విభాగం సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

వడగాలుల తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్రం ఐఎండీకి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందం వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు. వడగాలులు, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలను సూచించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కేంద్ర మంత్రి ఆదేశించారు. ఈ ప్రభావం చూపకుండా తగిన చర్యలు, సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.

Also Read: సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు మాండవీయ తెలిపారు. త్వరలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల మంత్రులతో కేంద్ర మంత్రి వర్చువల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read: KTR:విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసం

- Advertisement -