- Advertisement -
రానున్న మూడు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలకు పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రివేళల్లో కూడా గాలి ఉష్ణతా స్థాయిలోనే కొనసాగుతుందని తెలిపింది.
బుధవారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా ఇది సాధారణ స్థాయిని మించిపోయి 3.6 డిగ్రీల మేరకు ఎక్కువగా ఉంది. అదిలాబాద్‌లో 44.3, మెదక్ జిల్లాలో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరించింది.
ఎండల తీవ్రత పెరగడంతో వడదెబ్బతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని తెలిపారు.
Also Read:కోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగం
- Advertisement -

