నిద్రలో గుండెపోటు..జాగ్రత్తలివే!

39
- Advertisement -

గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిలో కామన్ అయిపోయింది. గుండెపోటు రావడానికి అనేక కారణాలున్నాయి. మనం తీసుకునే ఆహారం దగ్గరి నుండి, వ్యాయామం వరకు అన్ని జాగ్రత్తలను పాటిస్తే నిద్రలో గుండెపోటు ప్రమాదం నుండి బయటపడవచ్చు.

ప్రధానంగా నిద్రలో గుండెపోటు రావడానికి కారణం అధిక కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరిగి గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చెడు కొవ్వు పెరిగిపోతే అనారోగ్య సమస్యలు తలెత్తి క్రమేపీ హార్ట్ ఎటాక్‌కు దారి తీయవచ్చు. అందుకే హై కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు.

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే . అది గుండెకు చేరే రక్తాన్ని అడ్డుకుని గుండెకు సంబంధించిన బ్లాక్స్​ను క్లోజ్ చేస్తుంది. తద్వార ఇది గుండెపై తీవ్రమైన ప్రభావం చూపి హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది. అందుకే ఎల్‌డీఎల్‌ స్థాయిలను కంట్రోల్ చేసి రాత్రి పూట వచ్చే గుండెపోటు నుండి బయటపడాలని సూచిస్తున్నారు. ఒమేగా ఫ్యాటీ 3 కలిగిన ఫుడ్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా చేస్తే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

Also Read:మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం

- Advertisement -