బత్తాయి రసం తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

64
- Advertisement -

వేసవితాపం నుంచి బయట పడేందుకు రకరకాల పానీయాలు సేవిస్తూ ఉంటాము. ముఖ్యంగా లెమెన్, ఆరెంజ్, పుచ్చకాయ, వంటి పండ్ల రసాలతో పాటు మజ్జిగ, లస్సీ వంటి పానీయాలు కూడా సేవిస్తూ ఉంటాము. ఇక ఈ వేసవిలో వీటితో పాటు బత్తాయి రసం కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు చాలమంది. అయితే బత్తాయి రసం తాగడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మాత్రం చాలమందికి తెలియదు. శరీరానికి మంచి ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ లలో బత్తాయి రసం కూడా ఒకటి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి డీహైడ్రేషన్ కు గురికాకుందా చేస్తుంది. ముఖ్యంగా బత్తాయి లోని ఆమ్లాలు శరీరంలో వ్యర్థంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి.

ఇక గ్యాస్, అసిడిటీ వంటి వివిధ రకాల సమస్యలను దూరం చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడే వాళ్ళు ప్రతిరోజూ భోజనానికి ముందు బత్తాయి రసం తప్పక తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక బత్తాయిలో ఉండే పొటాషియం మూత్రపిండాల పని తీరును మెరుగుపరుస్తుంది. ఇంకా మూత్ర విసర్జనలో మంట, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇంకా వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా కలిగే అలసట, నీరసం వంటి వాటిని దూరం చేసి శరీరానికి ఇన్స్టంట్ గా శక్తినిస్తుంది. ఇంకా గర్భిణిలలో శిశువు పెరుగుదలకు బత్తాయి రసం మంచి పోషకాలు అందిస్తుందని పలు పరిశోదనలు చెబుతున్నాయి.

ఇంకా బత్తాయిలో ఉండే ఫ్లెవనాయిడ్లు మగవారిలో వీర్య కణాల వృద్దిని కూడా పెంచుతాయట. ఇక ఆయుర్వేద పరంగా కూడా తరచూ వేధించే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలకు బత్తాయి రసం చక్కటి పరిష్కారంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి రక్తం కారే చిగుళ్లపై పూస్తే వెంటనే ఆ సమస్య తగ్గుతుందట. ఇంకా బత్తాయి రసంలో జీలకర్ర, అల్లంపొడి వేసుకొని తాగితే ఆస్తమా కారణరంగా ఏర్పడే దగ్గు నుంచి విముక్తి లభిస్తుందని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు.

Also Read:పెసర మొలకలతో ఆరోగ్యం

- Advertisement -