అలీవ్‌ గింజలు..అద్భుత ప్రయోజనాలు!

6
- Advertisement -

ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరాల్లో ఒకటి అలీవ్ గింజలు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ మహిళల్లో బరువు పెరగడం, తగ్గడం , జుట్టు రాలిపోవడం కామన్. వీటన్నింటికి అలీవ్ గింజలు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడతాయి. తల్లైన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ అలీవ్‌ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

ఐరన్‌, ఫోలికామ్లం, విటమిన్‌ ‘ఎ’, విటమిన్‌ ‘ఇ’, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయ పడతాయి. అలాగే సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్లో అలీవ్‌ గింజలు ఒకటి.

క్యాన్సర్‌ చికిత్స రోగులు వాళ్లు అలీవ్‌ గింజల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీమోథెరపీతో మంచి కణజాలాలపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో ఏకాగ్రత, సత్తువను పెంచడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయి. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడం, సంతానోత్పత్తికి, మానసిక ఒత్తిళ్లు-ఆందోళనల్ని దూరం చేయడానికి అలీవ్ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

అలీవ్ గింజల్ని కొబ్బరి, నెయ్యి, బెల్లం కలిపి లడ్డూల్లా చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కువగా మధ్యాహ్నం భోజనం సమయంలో తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలీవ్‌ గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!

- Advertisement -