గ్రీన్ టీ తో ఇలా కూడా చేయొచ్చా?

31
- Advertisement -

సాధారణంగా గ్రీన్ టీ ని వెయిట్ లాస్ కోసం చాలామంది ఉపయోగిస్తుంటారు. ఆరోగ్య నిమిత్తం చాలామంది సేవించే పానీయాలలో గ్రీన్ టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. సాధారణ టీతో పోలిస్తే గ్రీన్ టీ లో ఔషధ గుణాలు ఎక్కువే. అందుకే ఆరోగ్య నిపుణులు గ్రీన్ టీ తాగమని సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉబకాయం, డయాబెటిస్ వంటి వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది ఇంకా ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు లివర్ సంబంధించిన వ్యాధులను కూడా దూరం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణంగా గ్రీన్ టీ ని పానీయంలా సేవిస్తూ ఉంటారు. అయితే దీనిని ఫేస్ ప్యాక్ లా కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు బ్యూటీషియన్స్. ఇందులో ఉండే పోషకాలు చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయట. గ్రీన్ టీ ని ఫేస్ ప్యాక్ లా ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ముఖంపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. ఇంకా ముఖంపై జిడ్డు మొటిమలు మచ్చలను కూడా తగ్గించి కాంతివంతంగా చేస్తుందని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. ప్రతిరోజు గ్రీన్ టీ ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేస్తే వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరవట. అయితే కేవలం గ్రీన్ టీ ని మాత్రమే కాకుండా దీనితోపాటు శనగపిండి లేదా తేనె లేదా పసుపు వంటి వాటిని కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయట.

ఒక స్పూను శెనగపిండి తో పసుపు కలిపి ఈ మిశ్రమానికి కాస్త గ్రీన్ టీ కలిపి ఫేస్ కి అప్లై చేసుకుంటే ముఖంపై ఏర్పడే ఆయిల్, జిడ్డు వంటివి తగ్గిపోయి కాంతివంతంగా మారుతుంది. ఇంకా కొద్దిగా బియ్యం పిండితో గ్రీన్ టీ, నిమ్మరసం జోడించి ఫేస్ అప్లై చేసుకుంటే నల్ల మచ్చల సమస్య తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ మరియు కొద్దిగా నారింజ తొక్కల పొడి మరియు తేనే కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా తగ్గిపోయి ముఖం నికారింపును సొంతం చేసుకుంటుందని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. కాబట్టి గ్రీన్ టీ ని కేవలం పానీయంగా మాత్రమే కాకుండా ఇలా కూడా ఉపయోగిస్తే ఎంతో మేలు అని చెబుతున్నారు బ్యూటీషియన్స్.

Also Read:వసూళ్లలో మహారాజ జోరు!

- Advertisement -