లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు!

106
- Advertisement -

లవంగాల గురించి మనందరికి తెలిసే ఉంటుంది. వంటల్లో వాడే సుగంధద్రవ్యం. ఇది వంటలకు మంచి సువాసన ఇవ్వడమే కాకుండా చక్కటి రుచిని కూడా అందిస్తుంది. లవంగాన్ని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా పలు ఔషధల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దంత సమస్యలను తగ్గించడంలో లవంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే వివిధ రకాల టూత్ పేస్ట్ లలో లవంగాన్ని ప్రధాన వనరుగా ఉపయోగిస్తారు. లవంగాలలో ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి మూలకాలు ఉంటాయి. అలాగే మాంగనీస్, విటమిన్ ఏ వంటివి కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగ పడతాయి.

ప్రతిరోజూ భోజనం చేసిన తరువాత లవంగా నమలడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఎందుకంటే కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే యాసిడ్ ను లవంగా ప్రేరేపిస్తుంది. అందుకే బలమైన ఆహారం తిన్నప్పుడు కచ్చితంగా లవంగా నమిలితే ఎంతో మేలట. ఇంకా చిగుల్ల వాపు, దంత క్షయం ఉన్న వాళ్ళు లవంగా పొడిని చిగుళ్లపై రుద్దితే ఆ సమస్యలు దురమౌతాయి. ఇంకా నోటి దుర్వాసనతో బాధపడే వారు కూడా ప్రతిరోజూ రెండు లవంగాలను నమిలితే నోటి దుర్వాసన దురమౌతుంది.

లవంగాలలో యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి అన్నీ రకాల నోటి సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా లవంగాలతో దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం వంటి సమస్యలు కూడా దురమౌతాయి. ఇంకా కడుపులో వికారం, తల తిరిగినట్లు ఉండడం వంటి లక్షణాలు ఉన్న.. లవంగా ముక్కను నోట్లో వేసుకొని నమిలితే వెంటనే ఆ వాటి నుంచి బయటపడవచ్చు. ఇంకా చెవినొప్పి బాధపడే వారు ఒకటి లేదా రెండు చుక్కలు లవంగా నూనెను చెవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది. ఇంకా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు లవంగా నూనెతో మర్ధన చేస్తే ఆ సమస్యలు దురమౌతాయి.

Also Read:సంఘర్షణ..రిలీజ్ డేట్

- Advertisement -