బెండకాయ తినట్లేదా.. ఇవి తెలిస్తే వదలరు!

32
- Advertisement -

కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆహార నిపుణులు నిత్యం చెబుతూనే ఉంటారు. అందుకే ప్రతిరోజూ కూరగాయలతో చేసిన వంటకాలే తినాలని చెబుతుంటారు. ఎందుకంటే కూరగాయలలో మన శరీరానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు సమృద్దిగా ఉంటాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు తినడానికి చాలమంది ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి వాటిలో బెండకాయ ఒకటి. దీనిని కర్రీ, వేపుడు, పచ్చడి.. ఇలా రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటారు. అయితే బెండకాయలో జిగురు శాతం ఎక్కువ అందువల్ల దీనిని చాలామంది తినరు. అయితే నిత్యం బెండకాయను ఆహార డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా ఆర్థరైటిస్ తో బాధపడేవారు తప్పకుండా బెండకాయ తినాలట. ఇందులోని కెరోటీన్లు, ఫ్లేవనాయిడ్లు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయట. .

ఇంకా రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడంలో కూడా బెండకాయ సమర్థవంతంగా పని చేస్తుందట. తద్వారా గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు రావని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇంకా బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరిచి అన్ని రకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ప్రతిరోజూ బెండకాయ తింటే క్యాన్సర్ కు కూడా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో దొరికే లెఫ్టిన్ అనే మూలకం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇంకా బరువు తగ్గించడంలో కూడా బెండ సమర్థవంతంగా పని చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే పీచు పదార్థం కారణంగా ఆకలి మందగిస్తుంది. తద్వారా వేగంగా బరువు తగ్గే వీలు కలుగుతుంది. ఇంకా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు సైతం బెండకాయను ఆహార డైట్ లో చేర్చుకుంటే వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:కంటి చూపు కాపాడుకోండిలా!

- Advertisement -