బాదం, పల్లీలతో లాభాలెన్నో!

46
- Advertisement -

పప్పు దినుసులలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి ముఖ్యంగా బాదం, వేరుశనగ వంటివి పోషకాలకు, విటమిన్లకు పవర్ హౌస్ లాంటివని న్యూట్రీషియన్స్ చెబుతుంటారు. 250 గ్రాముల బాదంలో 170 నుంచి 180 కెలోరీలు, 6-10 గ్రాముల ప్రోటీన్లు, 3-5 గ్రాముల పీచు ఉంటుంది. అదే విధంగా వేరుశనగలో 160-170 కెలోరీలు, 10-15 ప్రోటీన్లు, 2-5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి కండరాల పెరుగుదలలో ఈ రెండు ఎంతగానో సహాయపడతాయి. గుప్పెడు వేరుశనగలు నానబెట్టి ప్రతిరోజూ ఉదయం తింటే శరీరానికి కావలసిన అన్నీ రకాల పోషకాలు అందుతాయి. వేరుశనగలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లతో పాటు ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి..

అందువల్ల కండపుష్టితో పాటు ఎముకల పటుత్వం కూడా పెరుగుతుంది. ఇంకా జుట్టుకు సరైన పోషణ అంది.. జుట్టు బలంగా తయారవుతుంది. వేరుశనగలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇంకా నానబెట్టిన వేరుశనగలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పొరాడి ప్రాణాంతక కణాలను నివారిస్తాయని పలు అద్యనాలు చెబుతున్నాయి. తద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. ఇక బాదం విషయానికొస్తే.. ఇందులో కూడా ఆరోగ్యకరమైన పోషకలకు కొదువేమీ లేదు.

వేరుశనగతో పోల్చితే బాదంలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాదం తింటే ఎముకలు దృఢంగా మారడంతో పాటు విరిగిన ఎముకలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇంకా బాదంలను నానబెట్టి తినడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇంకా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయ పడతాయి. అయితే బాదం గాని వేరుశనగ గాని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనలు మెండుగా ఉన్నప్పటికి వీటిని అతిగా తింటే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:ఓటేసిన సినీ,రాజకీయ ప్రముఖులు

- Advertisement -