వ్యాయామం లేకుండా ఇలా బరువు తగ్గండి!

4
- Advertisement -

బరువు తగ్గాలి..అంటే అందరూ చెప్పేది వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారని అంతా చెప్పేది. కానీ వ్యాయామం లేకుండా బరువు తగ్గవచ్చనే విషయం మీకు తెలుసా. ఈ చిన్న టిప్స్ పాటిస్తే బరువు తగ్గడమే కాదు కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారు.. కాస్త కఠినమైన ఆహార పద్ధతులకు అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రోజు తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, పీచు, మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. ఒకపూట పొట్టు పప్పుతో చేసిన అల్పాహారం తీసుకునేలా మీ డైట్ ప్లాన్ సెట్ చేసుకోవాలి.

రాగిజావ, పండ్లు వంటివి స్నాక్స్​గా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చక్కెరలు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ వంటి వాటిన్ని ఎంత దూరం పెడితే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే ప్రతీరోజూ తగినన్ని వాటర్ తాగాలి. పచ్చి పండ్లు , పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆధిక బరువు ను తగ్గించుకోవచ్చు.

Also Read:ఆకలి వేయట్లేదా..ఇలా చేయండి!

కొవ్వు కరిగించే గుణాలు అధికంగా ఉన్న గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. అలాగే ఆహారం లో ఉప్పు శాతం తగ్గించాలి. మొలకెత్తిన పెసలు ,శెనగలు రోజు ఉదయాన్నే తింటే కొవ్వు తగ్గించుకోవచ్చు.

మాంసాహారాలు ,నూనె వంటలు తినడం వలన కొవ్వు పెరిగే ఆవకాశం ఉంది ,అందువల్ల వీటిని తినడం తగ్గించాలి. దంపుడు బియ్యం తక్కువ కాలరీలు కలిగి వుంటుంది ఆ అన్నం తింటే రోజంత ఆకలి అనిపించదు ,సులభంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో భోజనానికి బదులుగా , రెండు చపాతీలు తింటే బరువు తగ్గడంలో ఉపయోగ పడుతుంది.

- Advertisement -