చాలామందికి కాళ్లు చేతులు తరచూ తిమ్మిర్లకు గురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ తిమ్మిర్ల కారణంగా నడవలేని స్థితి కూడా ఏర్పడుతుంది. అయితే తిమ్మిర్లు ఎప్పుడో ఒకసారి రావడం సర్వసాధారణం. కానీ కొందరిలో ఈ సమస్య ప్రతి ఐదు నిమిషాలకోసారి లేదా పది నిమిషాలకోసారి వేధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమస్యను ఈజీగా తీసుకోరాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
చాలా మందికి రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. దీంతో కాళ్లు నొప్పిగా మారడంతో నిద్రలో మెళకువ వస్తుంది. శరీరంలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల లోపం వల్ల తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఎక్కువగా పని చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు అలసిపోతాము. దీనివల్ల కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయని చెప్పారు.
గర్భిణులలోనూ సహజంగానే కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి.మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, థైరాయిడ్, నరాల సంబంధిత సమస్యల వల్ల నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా విటమిన్ బి, డి, ఐరన్ వంటి పోషకాలు లోపిస్తే తిమ్మిర్ల సమస్య అధికమవుతుంది. ఇంకా కండర సంబంధిత సమస్యలు, ఊబకాయం, డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలు ఉన్న వారిలో కూడా ఈ తిమ్మిర్ల సమస్య కనిపిస్తోంది. అందువల్ల ఈ సమస్య నుంచి బయటపడడానికి.. పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. యాపిల్, ఆరెంజ్, కివి పండ్లలో విటమిన్ సి తో పాటు బి6 కూడా ఉంటుంది. ఇవి తిమ్మిర్లను తగ్గించి శరీరానికి పోషకాలను అందిస్తాయి. తిమ్మిర్ల సమస్య తగ్గాలంటే విటమిన్ డి కూడా చాలా అవసరం.
Also Read:అమెరికాలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు