ఈ వేసవిలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం పెద్ద సవాలే. ఎందుకంటే విపరీతమైన ఎండ, వాతావరణ మార్పుల కారణంగా శరీర ఆరోగ్యం వేగంగా దెబ్బ తింటుంది. అందుకే డిహైడ్రేషన్ పెరిగి వడ దెబ్బ తగలడం, ఇమ్యూనిటీ క్షీణించడం, కళ్ళు తిరగడం.. ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అందుకే వేసవిలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఇక వేసవిలో శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. తద్వారా రకరాల పానీయాలు సేవిస్తూ శరీరంలో నీటి శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఏవేవో పానీయాలు సేవించి కడుపు ఉబ్బరం, విరోచనాలు, వాంతులు వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే వేసవిలో ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా అధిగమించేందుకు ఒక డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆ డ్రింక్ ఏంటి ? ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. !
ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మకాయ రసం, దాల్చిన సి చెక్క పోటీ ఒక టీ స్పూన్, మెంతుల పొడి ఒక టీస్పూన్, కలిపి బాగా వేడి చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడూ ఈ డ్రింక్ సేవించాలి. ప్రతిరోజూ పడగడుపున సేవిస్తే ఎంతో మంచిది. దాల్చిన చెక్క, మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సీన్లను బయటకు పంపించడంలో సహాయ పడతాయి, ఇంకా వేసవిలో చాలమందిని వేధించే మలబద్దకం సమస్య కూడా దూరమౌతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ డ్రింక్ లో నిమ్మరసం కలపడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శాతం పెరుగుతుంది. తద్వారా డీహైడ్రేషన్ దరిచేరదు. ఇంకా ప్రతిరోజూ ఈ డ్రింక్ తాగితే మెటబాలిజం పెరుగుతుంది, వేగంగా బరువును తగ్గించడంలో కూడా ఈ డ్రింక్ సహాయ పడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఈ డ్రింక్ తయారు చేసుకొని సేవిస్తే మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
Also Read:KTR:బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్