600 చ.గ వరకే ఇందిరమ్మ ఇండ్లు: పొంగులేటి

18
- Advertisement -

పేదవాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన పొంగులేటి… 600 చ.గ పైన ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవాళ్లు పేదవాళ్లు కాదు అన్నారు. అలా చేస్తే ఎంపికలో తప్పు చేసినట్లుగా భావించాలి… కేంద్ర ప్రభుత్వం విజిట్ చేసినప్పుడు వీళ్లు ఎలా పేదవాళ్లు అవుతారు అని ప్రశ్నిస్తారు అని గుర్తుచేశారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తామన్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు ఏఐని వాడుతున్నాం అన్నారు. మంత్రిగా నేను ఫోన్ చేసినా.. పని పూర్తి కాకుండ పేమెంట్లు చేయొద్దు అన్నారు.

ప్రతి సోమవారం పేమెంట్లు ఇవ్వాలి… పనులు పూర్తి కాకుండా అనుమతి ఇస్తే హెడ్ ఆఫీస్‌లో బ్లింక్ అవుతుంది అన్నారు. ఈ మేరకు అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలు చేశారు.

Also Read:పాకిస్తాన్‌కు మరో దెబ్బ..

- Advertisement -