నేటి రోజుల్లో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం సగటు వ్యక్తికి పెద్ద టాస్క్ లా మారింది. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టి సారించే టైమ్ కూడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిగా జబ్బు బారిన పడిన వెంటనే ఆసుపత్రికి పెరుగెట్టుకొని వెళ్తాము. అయితే సీజన్ ను బట్టి కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. అలాగే గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసే వారిని కూడా కొన్ని సాధారణ సమస్యలు వెంటాడడం సహజం అలాంటి ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ప్రకారం కొన్నిటి కాంబినేషన్ చక్కగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాలమందిని పొడి దగ్గు సమస్య వేధిస్తుంది..
ఇలా ఉన్నప్పుడూ తేనె తీసుకుంటే దగ్గు తగ్గిపోతుందని అనుకుంటూఉంటారు. ఇందులో నిజం ఉన్నప్పటికి తేనెతో పాటు శొంఠి పొడి కాంబినేషన్ గా చేర్చుకుంటే పొడి దగ్గు మరింత త్వరగా తగ్గిపోతుందట. ఇంకా అర టిస్పూన్ ఆవపొడిని తేనెతో కలిపి తీసుకున్న దగ్గు మటుమాయం అవుతుందట. ఇక అరటిపండు మంచి పోషకాలు కలిగిన ఆహారం అని సంగతి అందరికీ తెలిసిందే. అయితే అరటిపండు కూడా కొన్ని రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయ పడుతుందట.
అరటిపండును ముక్కలు గా చేసుకొని పెరుగుతో కలిపి తింటే దయారియా అదుపులోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆస్తమాతో బాధపడే వారు శ్వాస సరిగా ఆడక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వెల్లుల్లి రెబ్బలను పాలలో వేసి మరిగించి వాటిని రోజు పడుకునే ముందు తాగితే ఆస్తమా తగ్గుతుందట. ఇక తేనెతో పాటు దాల్చిన చెక్క కలిపి ప్రతిరోజూ తీసుకుంటే వచ్చే లాభాలు అన్నీ ఇన్ని కావు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, జీర్ణశక్తిని మెరుగుపరచడం ఇలా చాలా రకాల ఉపయోగాలు కలుగుతాయట. అందుకే ఆయుర్వేదంలో కొన్నిటి కాంబినేషన్ ఎంతో మంచిదని నిపుణులు చెబుయితున్నారు.
Also Read:‘సేవ్ ద టైగర్స్ 2’..రిలీజ్ డేట్ ఫిక్స్