Skin: చర్మం పొడిబారుతోందా..ఇలా చేయండి!

53
- Advertisement -

చలికాలంలో చర్మం పొడిబారడం చాలామందిని వేధించే సమస్యలలో ఒకటి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చర్మం పొడిబారినప్పుడు దద్దుర్లు, పగుళ్లు ఏర్పడి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో చాలామంది బాడీ లోషన్స్, మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటారు. బోలెడంత నగదు పెట్టి రసాయనాలతో కూడిన మాయిశ్చరైజర్స్ వాడడం వల్ల మరిన్ని చర్మ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆయుర్వేదం ప్రకారం కొన్ని సహజసిద్ద పద్దతుల ద్వారా ఈ శీతాకాలంలో చర్మాన్ని సంరక్షించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చర్మం పొడిబారే సమస్యను తగ్గించడంలో తేనె అద్భుతంగా పని చేస్తుందట. తేనెలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు చర్మానికి మంచి పోషణను అందించి చర్మంపై పగుళ్లను, దద్దుర్లను నివారిస్తుందట..

ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చర్మానికి, ముఖానికి, కాళ్ళు, చేతులకు తేనె రాసుకొని పడుకోవడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలైన దూరమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె వంటివి కూడా చాలా బాగా ఉపయోగ పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీనిని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మంలో తేమశాతాన్ని సమతుల్యం గా ఉంచుతుంది. తద్వారా చర్మ సమస్యలు దరిచేరవు. ఇక ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ లో కూడా పుష్కలమైన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి కూడా చర్మ సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ శీతాకాలంలో వేలకు వేలు డబ్బు పెట్టి ఖరీదైన రసాయన మాయిశ్చరైజర్స్ వాడడం కంటే సహజసిద్దమైన పోషకాలు ఉన్న వాటిని వాడడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

Also Read:బ్రేకింగ్..ట్రంప్‌కు బిగ్ షాక్

- Advertisement -