నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా కూర్చొని పని చేసే వారికి, శారీరక శ్రమ లేని వారికి ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. ప్రధానంగా మలబద్దక సమస్య. ఉదయం నిద్ర లేవగానే సాఫీగా మలవిసర్జన జరగకపోవడానికి ఇ సమస్యే ప్రధాన కారణం. మలబద్దకం రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. శారీరక శ్రమ లేకపోవడం ఒక కారణమైతే.. ఒంట్లో నీటి శాతం, ఫైబర్ కంటెంట్ వంటివి తక్కువగా ఉండడం కూడా మరో కారణం. ఈ మలబద్దక సమస్య అలాగే కొనసాగితే ప్రేగు క్యాన్సర్, పైల్స్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా మలబద్దకం ఉండడం వల్ల ఆకలి మందగించడం, రోజంగా బద్దకంగా ఉండడం వంటివి కూడా చుట్టూ మూడతాయి. కాబట్టి మలబద్దకం నుంచి బయటపడి మలవిసర్జన సాఫీగా జరగాలంటే కొన్ని చిట్కాలు సూచనలు పాటిస్తే ఎంతో మంచిది అవేంటో తెలుసుకుందాం !
వ్యాయామం
ప్రతిరోజూ నిద్ర లేవగానే కనీసం ఒక అరగంట వ్యాయామం చేయడం ఎంతో మేలు. వ్యాయామం చేయడం వల్ల శరీర అవయవాలన్నీ యాక్టివ్ గా మారతాయి. ఇంకా శరీరంలోని టాక్సిన్లు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతాయి తద్వారా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
నీరు ఎక్కువగా త్రాగడం
చాలమంది తగినంత నీరు త్రాగడంలో అశ్రద్ద చూపుతూ ఉంటారు. రోజు కనీసం 4-5 లీటర్ల నీరు తాగితే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల అవయవాల పనితీరు మందగిస్తుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ కూడా బద్దకంగా మారుతుంది. కాబట్టి తగినంతా నీరు త్రాగడం ఎంతో ముఖ్యం.
సబ్జా విత్తనాలు
మలబద్దకం అతిగా ఉన్నవారికి సబ్జా గింజలు చక్కటి నివారణగా పని చేస్తాయి. సబ్జా గింజలను రాత్రంతా ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఆ తరువాత ఆ నీటికి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి తరువాత కాస్త మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడూ సేవిస్తే మలబద్దకం నుంచి ఉపశమనం పొంది.. విసర్జన సాఫీగా జరుగుతుంది.
నల్ల ఎండు ద్రాక్ష
నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. రాత్రంగా వీటిని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆ నీటితో పాటు ఎండు ద్రాక్షలను కూడా తింటే ప్రేగులో కదలికలు ఏర్పడి మలబద్దకం దురమౌతుంది. తద్వారా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
Also Read:ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్.. మాస్ సాంగ్ అప్‌డేట్